జియో యూసర్లకు మరో శుభవార్త

భారత్​లో డేటా విప్లవానికి నాంది పలికిన నెట్​వర్క్​ రిలయన్స్ జియో. ఇతర నెట్​వర్క్​లకు కాల్ చేసేందుకు నిమిషానికి 6 పైసలు వడ్డింపుతో వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందీ సంస్థ. కొంతమంది వినియోగదారులు జియోను వదిలేస్తున్న విషయాన్ని గమనించి నష్ట నివారణ చర్యల వైపు అడుగులు వేసింది. డేటాతో పాటు ఇతర నెట్​వర్క్​లకు కాల్​ చేసేందుకు ఉచితంగా వెయ్యి నిమిషాల బ్యాలెన్స్​ అందిస్తూ నూతన టారిఫ్ ప్లాన్లు ప్రకటించింది.

కొత్త టారిఫ్ లు ఇవే

మూడు నెలలపాటు 2జీబీ డేటాను అందించే రూ. 448 ప్రణాళికను రూ. 444గా మార్చింది జియో. ఈ డేటాతో పాటు ఇతర నెట్​వర్క్​లకు కాల్​ చేసేందుకు రూ. 80 విలువ చేసే వెయ్యి నిమిషాలను ఉచితంగా అందించనుంది.

రెండు నెలల 2జీబీ డేటా ప్లాన్​ను రూ. 333కు…, రూ. 198 గా ఉన్న నెల రోజుల ప్లాన్​ను రూ. 222 కు మార్చింది జియో. ఈ ప్లాన్​లతో పాటు రూ. 80 విలువ చేసే వెయ్యి నిమిషాల ఇతర నెట్​వర్క్ నిమిషాలను అందించనుంది. ఈ ప్లాన్​తో జియో టూ జియో అపరిమిత ఉచిత కాల్స్ అదనం.

ఇతర నెట్​వర్క్​లతో పోలిస్తే తక్కువే..

నూతన టారిఫ్​ ధరలతో ఇప్పటికీ తామే దిగ్గజాలమని చాటుకుంటోందీ డేటా దిగ్గజం. ఇతర నెట్​వర్క్​లతో పోలిస్తే తక్కువ ధరల్లోనే ఈ టారిఫ్​లను అందిస్తోంది.
నెల రోజుల ప్లాన్​లో జియో నూతన టారిఫ్​ ధర రూ. 222 కాగా ఎయిర్​టెల్ రూ. 249కు 2 జీబీ డేటా, వొడాఫోన్ రూ. 255తో 2.5జీబీ డేటా అందిస్తున్నాయి. అయితే మిగతా నెట్​వర్క్​లు అపరిమిత ఉచిత కాల్స్ అందిస్తుండగా.. జియోలో వెయ్యి నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడాలనుకుంటే మాత్రం మరికొంత ధర చెల్లించక తప్పదు.

Leave a Reply

*