బీజేపి నెక్స్ట్ టార్గెట్ వైకాపా కాబోతుందా ?

బీజేపి భారతదేశం అంతా తన అధికారాన్ని చూపడానికి ప్రతి రాష్ట్రానికి తనదైన శైలి లో ఎత్తుగడలు వేస్తూ ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వైకాపా నే తమ టార్గెట్ అన్నట్లు ఆంధ్రా బీజేపి నాయకులూ కూడా డైరెక్ట్ గానే వైకాపా ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరం అయ్యిన విషయం ఏంటి అంటే దానికి వైకాపా నాయకులూ ఎవరి దగ్గరనుండి కూడా సమాధానం రావడమ లేదు. చూడబోతే బీజేపి కి తలవంచినట్లు కనపడుతున్నా వారు పంపే లేఖలు నిర్ణయాలను కనీసం పట్టించుకోక పోవడం చుస్తుంటే ఏదో విపత్తు త్వరలో ఉండబోతున్నట్లు కనపడుతుంది.

ఆంధ్రలో వైకాపా ను ఎదోర్కోవడానికి బీజేపి అందుకే తెదేపా లో ఉండే బలమైన నాయకులను తనవైపు తిప్పుకుంది, సుజనా ఇప్పటికే ఆ పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.జగన్ ప్రభుత్వ శైలి గురించి ఇప్పటికే బీజేపి అధిష్టానం కి వివరాలు అన్ని చేరాయి. విద్యుత్ ఒప్పందాల పట్ల అలాగే పోలవరం పై తీసుకున్న నిర్ణయాల పై బీజేపి అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అలానే మొన్న కోడెల ఆత్మహత్యకు కారణం కేసులతో వేదించడం అని కేంద్రానికి సమాచారం కూడా వెళ్ళింది అని తెలుస్తుంది.

అదే గాని జరిగితే ఇక్కడ బీజేపి వారు తక్కువ మంది ఉన్నా సరే అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది, బీజేపి వారి జోలికి వైకాపా ప్రభుత్వం వెళ్ళదు అనడానికి చిన్న ఉదాహరణ ప్రజవేదికను మాత్రం కూల్చారు కానీ పక్కనే ఉన్న బీజేపి వారి నిర్మాణాలను మాత్రం టచ్ కూడా చేయలేక పోయారు. ప్రజల్లో కూడా ఈ విషయం బాగా నాటుకు పోయింది. బీజేపి ఆపరేషన్ వైకాపా కు సుజన తో కూడిన బృందం ఇపటికే కసరత్తులు మొదలు పెట్టింది అని తెలుస్తుంది. ఇవన్ని చూస్తుంటే అసలే ఇచ్చిన హామీలను కనీసం నేరవేర్చలేకుండా కుంటుతున్న వైకాపా మీద తాటికాయ పడ్డట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

*