సచివాలయ పరీక్షా రిజల్ట్ లో గోల్ మాల్ !

అవునండి నిజమే, ఆంధ్రప్రదేశ్ ప్రదుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షలో పేపర్ లీక్ గురించి కొద్దిరోజులుగా దుమారం లేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా ఫలితాలు రావడం తో మరొక విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామ సచివాలయం పరీక్షలో గుంటూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంపీటీటేషన్ విద్యార్థికి అన్యాయం జరిగింది.  ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగానికి రమ్య అనే విద్యార్థిని ఈ నెల 7న పరీక్ష రాసింది. అక్కడవరకు బాగానే ఉంది.

తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కీ ప్రకారం ఆమెకు 60 మార్కులు వచ్చాయి. అయితే ఫలితాలలో మాత్రం కేవలం 42 మార్కులు వచ్చాయి. ఇప్పుడు దీనికి ఎవరికీ ఫిర్యాదు చేయాలో అర్ధం కాక చివరికి ఏపీపీఎస్సీ కార్యాలయంలో సంప్రదిస్తే హెల్ప్ డెస్క్‌లో ఫిర్యాదు చేయాలని సిబ్బంది సలహా ఇచ్చారు. సరే అక్కడైన న్యాయం జరగక పోదా అని హెల్ప్ డెస్క్ సిబ్బందికి కూడా ఆమె ఫిర్యాదు చేసింది, వారి నుండి కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇప్పుడు తను దిక్కు తోచని పరిస్థితుల్లో ఉంది. దీంతో ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థి రమ్య బోరుమంటోంది.

ఇలాంటి మరో కొందరు విద్యార్దులు కూడా ఉన్నారు వారికీ కూడా ఎవరికీ ఫిర్యాదు చేయాలో తెలియదు చేసినా సమాధానం రాకపోవడం తో నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అందరికి ఆశే ఉంటుంది కానీ వారికీ చివరికి నిరాశే మిగులుతుంది. ఉత్తీర్ణులు అయిన వారు మాత్రం పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

*