ఆంధ్రప్రదేశ్ ను కౌగిలించుకోనున్న కరువు !

కరువు ఆ పేరు విని తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం అయ్యింది, రాయలసీమ వంటి చోట కూడా గత నాలుగు ఏళ్ళలో వర్షాలు పడ్డాయి, చెరువులకు నీళ్ళు వచ్చాయి. హార్టికల్చర్ లో ఆంధ్రప్రదేశ్ ను అగ్ర స్థానం లో ఉంచిన పరిస్థితులు కూడా చూసాం. కానీ గత ఈసారి కరువు సూచనలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఎక్కడా వర్షాలు లేవు, ప్రాజెక్ట్ లలో నీళ్ళు లేవు, బోర్లు బావులు తో పండిద్దాం అంటే విత్తనాల కొరత, ఒక వేల దొరికినా అవి నకిలీ అవ్వడం మొలకలు రాకపోవడం ఇది పరిస్థితి.

ఇంతటి పరిస్థితి ఉంటె జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రజా వేదకలు కూల్చడం, అన్నా క్యాంటీన్ కు రంగులు మార్చడం వంటివి చేస్తూ కూర్చున్నారు. ఎంత అధికారానికి కొత్త అయ్యినా మరి ఇలా బాధ్యతా రహితంగా ఉండటం సామాన్య ప్రజలకు అప్పుడే మింగుడు పడటం లేదు. ఒక వైపు ఇసుక తవ్వకాలు ఆపేసారు. గత ప్రభుత్వం లో ఇసుక ఫ్రీ కాబట్టి భవన నిర్మాణాలు బాగా జరిగేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు, రైతు కులిలకు పని లేదు, భవన నిర్మాణ కార్మికులకు పని లేదు, రైతులు వర్షాలు లేక దిక్కు తోచని పరిస్థితి లో ఉన్నారు.

ఇక ఉద్యోగాలు అంటారా ప్రపంచ బ్యాంకు ఇస్తాను అన్న డబ్బులు ఇవ్వను అని తేల్చేసింది, AIIB కూడా ఆంధ్రప్రదేశ్ కు ఇస్తాను అన్న 1,350 కోట్ల రూపాయలను ఇవ్వలేము అని చెప్పింది, ఇక అమరావతి నిర్మాణం లో పాలు పంచుకుంటాం అని మాటిచ్చిన సింగపూర్ కూడా చేతులు ఎత్తేసింది, వచ్చిన కంపెనీ లు వెనక్కి పోతుంటే ఇక ఉద్యోగాలు అనేది ఉట్టి మాటే. పలు youtube ఛానల్ వారు చేసిన ఇంటర్వ్యూ లలో అప్పుడే జగన్ ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందొ అర్ధం అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటే వినడానికి కాస్త బాధగా ఉన్నా అదే నిజం అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి.

Leave a Reply

*