ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి అచ్చెన్నాయుడు

ఈఎస్‌ఐ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి పోలీసులు తరలించనున్నారు. గుంటూరు రమేష్‌ ఆస్పత్రిలో అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నారు. అచ్చెన్నకు కరోనా సోకడంతో హైకోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. అచ్చెన్నాయుడు తరపు లాయర్ల సూచనతో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. అచ్చెన్నాయుడుకు ప్రత్యేక గదిలో చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది.

ఇటీవల అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్-12న అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

*