ఏపిలో రాపిడ్ స్పీడ్ తో పెరుగుతున్న కరోనా

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1608 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 1576 కాగా.. 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొవిడ్‌తో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో […]

ఫోటో షూట్ కోసమేనా అంబులెన్స్‌లు ?

108 వాహ‌నం న‌డుపుతూ నగరి ఎమ్మెల్యే రోజా ‌ ఫోటోల‌కు ఫోజ్ ఇచ్చిన తీరుపై సోష‌ల్ మీడియాలో తీవ్ర‌మైన విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఫోటో షూట్‌ల కోసం అంబులెన్సులను వాడుకోవ‌డమేంట‌ని ప‌లువురు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. సీఎం జ‌గ‌న్ రాష్ట్ర‌వ్యాప్తంగా ఓసారి ఈ వాహ‌నాల‌ను ప్రారంభించిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యేకంగా ఈ ప్రారంభోత్స‌వాల హ‌డావుడి ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎమ‌ర్జెన్సీ వాహ‌నాల‌ని చెప్తూనే.. ఇంకా ఎన్ని రోజులు వాటిని ప్రారంభించ‌కుండా ఆల‌స్యం చేస్తార‌ని కామెంట్లు చేస్తున్నారు.   అంబులెన్సులని […]

రాజమండ్రి జైలుకు కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్రను మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం రవీంద్రను రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు. గత నెల 29న మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరా వు(57) మచిలీపట్నం చేపలమార్కెట్‌ వద్ద హత్యకు గురయ్యారు. ఆ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. […]

అచ్చెన్న చుట్టూ అసలు ఏం జరుగుతుంది ?

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత, తన చిన్నాన్న అచ్చెన్నాయుడిని ఎలాగైనా జైలులో ఉంచేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుడిగా బాబాయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఉన్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి ఆయన మంగళవారమిక్కడకు వచ్చారు. ఆస్పత్రి అధికారులు అనుమతించకపోవడంతో వైద్యులను అడిగి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన పరిస్థితిపై ప్రతి రోజూ హెల్త్‌ […]

అచ్చెన్నాయుడు ను ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలివే

ఈఎస్‌ఐలో సిఫారసు లేఖల ఆధారంగా కొనుగోళ్లు జరగవని, కాంట్రాక్టులు కూడా ఇవ్వరని టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రజాప్రయోజనార్ధం గానీ, ప్రభుత్వ ప్రయోజనం కోసం గానీ సిఫారసు లేఖలు ఇవ్వడం సర్వసాధారణమన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను ఏసీబీ అధికారులు రెండోరోజు శుక్రవారం కూడా విచారించారు. అచ్చెన్నాయుడి న్యాయవాది మాగులూరి హరిబాబు, డాక్టర్‌ అమృతవల్లి సమక్షంలో విచారణ ఐదు గంటలపాటు సాగింది. ఏసీబీ డీఎస్పీలు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, చిరంజీవి […]

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన రఘురామకృష్ణంరాజు

కేంద్ర ఎన్నికల సంఘాన్ని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు కలిశారు. తనకు జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటుపై ఫిర్యాదు చేశారు. పార్టీ లెటర్‌ హెడ్ కాకుండా మరో పేరుతో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సంజాయిషీ కోరితే సాధారణంగా ఎవరైనా సమాధానం ఇస్తారు… కానీ, రఘురామకృష్ణంరాజు దీనికి భిన్నంగా తనకు నోటీసు పంపినవారికే ప్రశ్నలు సంధించారు. అసలు ఏ పార్టీ […]

ఏపీ డీజీపీకి చంద్రబాబు ఘాటైన లేఖ

టీడీపీ నాయకులపై తప్పుడు కేసులకు నిరసనగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటైన లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస అరాచకాలపై బాబు ధ్వజమెత్తారు. దళితులపై దాడులు- దౌర్జన్యాలు, టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు, అరెస్ట్‌లపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం…. ఇప్పుడు అయ్యన్నపాత్రుడిపై వరుసగా అనేక కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, […]

భయం భయం : 24 గంటల్లో 351 కేసులు

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 351మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తాజా కేసుల్లో రాష్ట్రంలోని వారు 275మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50మంది, విదేశాల నుంచి వచ్చిన 26మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో స్థానికంగా 5,555మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,253మంది, విదేశాల నుంచి వచ్చిన 263మంది కరోనా బారినపడ్డారు. బుధవారం కర్నూలులో ఒకరు, గుంటూరులో మరొకరు […]

సీఎం జగన్‌కు చుక్కెదురు.. సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చి సీబీఐ కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. విచారణలో ఉన్న ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ విచారణ పూర్తయ్యేంత వరకూ ఈడీ విచారణ చేపట్ట రాదన్న జగన్ పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసును శుక్రవారం విచారణ […]

రేపు ఎన్టీఆర్ వర్ధంతి… అమరావతి ర్యాలీ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ నేతలు శనివారం భారీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇదే క్రమంలో… ఆయన వర్ధంతితోపాటు… రాజధాని అమరావతికి మద్దతుగా కూడా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 9-30 గంటలకు పొట్టిపాడు రోడ్డు కూడలిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరుగుతుందని మాజీ శాసనసభ్యుడు మల్లెల లింగారెడ్డి వెల్లడించారు. వర్ధంతి కార్యక్రమం అనంతరం… ‘రాజధాని అమరావతి’కి మద్దతుగా పట్టణంలో మోటార్ సైకిళ్ళ ర్యాలీ జరుగుతుందని […]