కాంగ్రెస్ తో కూటమిపై అయ్యన్న రియాక్షన్..‍‍! క్షోభ పడేవాళ్లను మరింత క్షోభ పెడుతుందా..?

కాంగ్రెస్ తో పొత్తులపై గతంలో వివాదాస్పద ప్రకటనలు చేసిన అయ్యన్న పాత్రుడు.. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ దేశాన్ని మోదీ కబలించేందుకు ప్రయత్నిస్తున్నాడని, దీన్ని అ డ్డుకునేందుకు అన్ని విపక్ష పార్టీలను ఏకం చేసి దేశాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టడం పై అధిష్ఠానం నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కేవలం మోదీని అణగదొక్కడానికే అన్ని పార్టీలు ఏకమవుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జతకట్టడం వల్ల టీడీపీకి ఒనగారేదేమీ లేదన్నారు. ఆ పార్టీ పదిసీట్లు గెలవాలంటే పది నుంచి 15 ఏళ్లు పడుతుందన్నారు.

పొత్తు ఖరారయిందన్నట్లుగా… కొంత మంది కాంగ్రెస్ నేతలు.. భావిస్తున్నారు. అతే తరహాలో ప్రకటనలు చేస్తూ.. విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వట్టి వంసతకుమార్ , సి. రామచంద్రయ్యలు ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలోని ఓ మాదిరి జన బలం ఉన్న నేతలంతా ఎప్పుడో ఇతర పార్టీల్లో చేరిపోయారు. సొంతంగా గెలవగలిగే ఒక్క నేత కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో లేరు. ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు టీడీపీ కలసి రావడంపై సంతోషంగానే ఉన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి… అక్కడి పార్టీ మహాకూటమిలో చేరాలని నిర్ణయించుకుంది. కానీ ఏపీలో పొత్తుల గురించి కానీ .. సీట్ల సర్దుబాటు గురించి కాని ఇంత వరకూ కనీస చర్చ కూడా రాలేదు. దీంతో.. టీడీపీ నేతల్లో క్లారిటీ వస్తోంది. కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు అనే అంశంమే ఉండదని చెబుతున్నారు..

అయితే అసలు కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు ఉండదని.. ఇప్పటికిప్పుడు చెప్పడం … కష్టమేనని.. రాజకీయవర్గాల అంచనా. ఎందుకంటే… జాతీయ స్థాయిలో మారే పరిణామాలు కూడా… పొత్తుల వ్యవహారాల్ని ఖరారు చేస్తాయి. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే… ఇప్పుడు అందరూ విమర్శలు చేస్తున్నట్లు.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి దూరంగా ఉండటం కారణం కాదు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న కోపం ఏ స్థాయిలో ఉందన్న విషయమే పొత్తుల విషయం తేల్చనుంది. ఈ విషయాన్ని అయ్యన్న తెలుసుకున్నారు.

Leave a Reply

*