జూదానికి బానిసైన కానిస్టేబుల్ ఏం చేశాడంటే…

పుట్లూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకట రమేష్ అనే కానిస్టేబుల్‌పై 5 కేసులు నమోదయ్యాయి. నాలుగు కేసులు పుట్లూరు పోలీస్ స్టేషన్‌లో ఒకటి అనంతపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. జూదానికి బానిసైన వెంకట రమేష్.. పరిచయం ఉన్న వారి నుంచి సుమారు 20 కార్లను బాడుగకు తీసుకున్నాడు.

ఆ కార్లను వేరే వాళ్ల దగ్గర కుదువ పెట్టి డబ్బు తీసుకుని.. వచ్చిన డబ్బుతో జూదం ఆడాడు. దీంతో డబ్బు మొత్తం పోయింది. కార్ల యజమానులకు తిరిగి కార్లు ఇవ్వలేదు సరికదా.. బాడుగ కూడా ఇవ్వలేదు. అదేమంటే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో కార్ల యజమానులు వారి వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వెంకట రమేష్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కార్లను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

*