గుంటూరులో నేపాల్ బాలికపై అత్యాచారం

ఇటీవల గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. గుంటూరులో నేపాల్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొత్తపేటలో నాలుగేళ్ల బాలికపై వేణుగోపాల్‌(40) అత్యాచారం చేశాడు. అంతేకాదు ఎవరికీ చెప్పొద్దని బాలికను వేణుగోపాల్‌ గాయపరిచాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటువంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించేందుకు తెచ్చిన దిశ బిల్లును అసెంబ్లీ ముక్తకంఠంతో ఆమోదించిన రోజే గుంటూరు సిటీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఉదంతంపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. బాధితురాలు చికిత్స పొందుతున్న జీజీహెచ్‌ ఆస్పత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకొని.. నిరసన తెలిపాయి. ‘నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేస్తారా.. లేక రెడ్డి సామాజికవర్గంవాడని చెప్పి వదిలిపెడతారా’’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశాయి.

మహిళలపై జరుగుతున్న హత్యాచారాలను అరికట్టేందుకు సీఎం జగన్ దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. శీతాకాల సమావేశాల్లో దిశ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహిళలు, చిన్నారులకు రక్షణ, వారిపై అకృత్యాలకు పాల్పడేవారికి మరణదండన విధించేలా రూపొందించిన ఏపీ దిశ-2019 బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అత్యాచారానికి పాల్పడిన వారిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా 21 రోజుల్లో విచారణ జరిపి శిక్షిస్తామని జగన్ స్వయంగా ప్రకటించారు. మహిళల కోసం అనేక చట్టాలను తెస్తున్నప్పటికీ కామాంధులు బరితెగిస్తున్నారు.

Leave a Reply

*