జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి కాసేపట్లో విడుదల

కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ముందస్తు సమాచారంతో కడప జైలు వద్దకు జేసీ అనుచరులు భారీగా చేరుకున్నారు. తాడిపత్రి నుంచి దాదాపు రెండు వందల వాహనాల్లో జేసీ అనుచరులు వచ్చారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి విడుదలైన వెంటనే భారీ ర్యాలీగా తాడిపత్రికి వెళ్తారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగాల కేసులో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కడప జైలులో వీరిద్దరూ 54 రోజులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కాసేపట్లో జైలు అధికారులు ఇద్దరిని విడుదల చేస్తారు. జేసీ అనుచరులతో కడప జైలు వద్ద పండుగ వాతావారణం నెలకొంది.

Leave a Reply

*