కోడి కత్తి డ్రామా ఫ్లాప్ అని జగన్ అలిగారా..? ప్రజల్లోకి రావడానికి సిగ్గుపడుతున్నారా..?

వైఎస్ జగన్ పాదాయాత్ర మరో పదిరోజులు వాయిదా వేసుకున్నారు. దీనికి కారణం.. కోడి కత్తి డ్రామాలో అనుకున్నంతగా సీరియస్ నెస్ పండలేదట. తాను కమెడియన్ ని అయిపోవడంతో.. ప్రజలకు ఎలా మొహం చూపించాలో … ఆయనకు అర్థం కావడం లేదు. అందుకే డాక్టర్లను పిలిపించుకుని.. గాయం మానలేదని చెప్పించుకున్నారు. జగన్ గాయం విషయంలోనో చాలా పెద్ద సెటైర్లు పడ్డాయి. ముల్లు గుచ్చుకుంటే ఎలాంటి గాయం అవుతుందో.. అలాంటి గాయానికి … పది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నా.. ఇంకా.. గాయం తగ్గలేదన్న కారణం చూపి.. పాదయాత్రకు డుమ్మకొట్టడం ఏమిటో.. సొంత పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు.

భుజం కదిలించవదద్దని డాక్టర్లు చెప్పారట…ఆ మాత్రం గాయానికే.. అంత షో చేస్తున్నారేమిటా అన్న ప్రశ్నలు.. అన్ని వైపుల నుచి వస్తున్నాయి. రాజకీయ లబ్ది కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం సక్సెస్ కాకపోతూండటంతో…. వైసీపీ వర్గాలు.. కొత్త ప్లాన్లేస్తున్నాయని అంటున్నారు. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం.. వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చిన వెంటనే రాష్ట్రపతిని కూడా కలిసి.. ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. జగన్ తో సహా హైకోర్టులో మొత్తం మూడు పిటిషన్లు వేశారు. స్వతంత్ర సంస్థ దర్యాప్తును కోరుతున్నారు. వాటిపై విచారణ జరగనుంది. వీటిలోఏమైనా… కాస్తంత మైలేజీ వచ్చే వ్యవహారాలు నడిస్తే… రాజకీయం చేసుకుందామని.. జగన్ ఆలోచిస్తున్నారు.

కోడి కత్తి తో గుచ్చించుకున్న తర్వాత కులాసాగా నడిచి వెళ్లిన జగన్ కావాలనే సాగదీస్తున్నారనే విమర్శలు సహజంగానే వస్తున్నాయి. రాజకీయ మైలేజ్ తీసుకోవడం ఎలా అనే వ్యూహరచనలో వైసీపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే నవ్వుతారని… అందుకే.. వీలైనంతగా..ఆలస్యం చేయాలనుకుంటున్నారు. అప్పుడైతే ప్రజలు మర్చిపోతారని అనుకుంటున్నారు. ఈ విషయంలో.. ఎన్ని రోజులు … అనేది జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వతా బస్సుయాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక పాదయాత్ర లేనట్లేనన్న భావన ఉంది.

Leave a Reply

*