కౌషల్ కి కోతలు ఎక్కువ, ఎలా మోసం చేశాడో ప్రూఫ్ ఇదే

కౌశల్ ఆర్మీ” రెండు నెలల క్రితం వరకు ఈ పదం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం అని సోషల్ మీడియాలో ఆ ఆర్మీలో ఉన్న వ్యక్తులు చేసిన ప్రచార౦ అంతా ఇంతా కాదు.. ఒక ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో కి సంబంధించి సోషల్ మీడియాలో ఆ వ్యక్తి అభిమానులు నానా రాద్దాంతం చేసారు. కౌశల్ గెలవాలి, లేకపోతే మేము అన్నం తినేది లేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు మహిళలు వీడియోలు పోస్ట్ చేయడం సహా మరికొందరు అయితే ర్యాలీలు నిర్వహించి అతని గెలుపుకి కృషి చేసారు.

అతని మాటలకు లాజిక్ లు వెతకని అభిమానులు అతను చెప్పిన సొల్లు అంతా విని వల వలా ఏడ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. అందులోకి రాకముందు వరకు ఎవరికి తెలియని సదరు వ్యక్తి గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని చేసాడు. మరి ఆ పేరు వీక్షకులను ఆకట్టుకోవడమో మరో కారణమో తెలియదు గాని అతని కోసం బయట డబ్బులు ఇచ్చి పరుగులు కూడా తీయించింది ఆ ఛానల్ అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక బాబు… ఆ షో లో గెలవడం, మీడియాకు ఇంటర్వ్యులు ఇవ్వడం.. ఎక్కడకు వెళ్ళినా తనను తాను ఒక సేలేబ్రేటి మాదిరి ఊహించుకోవడం.. జరిగాయి.

ఈ క్రమంలో అతను మాట్లాడిన కొన్ని మాటలు జనాలకు ‘ఇతనికి పిచ్చి ఉందేమో’ అనే అనుమానాలు కూడా కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఛానల్ తో మాట్లాడిన అతను.. ప్రధాని ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది.. శుభాకాంక్షలు చెప్పారు.. నేను షూటింగ్ లో ఉంటె మా నాన్న ఎత్తితే శుభాకాంక్షలు చెప్పి పెట్టేసారు అని చెప్పేసాడు. ఈ ఇంటర్వ్యు చూసిన అతనిని అభిమానించిన వ్యక్తులు సైతం జుట్టు పీక్కుని.. ఎక్కడ దొరికాడు రా బాబు అని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పోస్ట్ చేసారు. బిగ్ బాస్ అనే షో గత పదేళ్ళుగా బాలివుడ్ లో జరుగుతుంది..

ఎందరో ప్రముఖులు పాల్గొన్నారు.. ఎవరికి ఫోన్ చెయ్యని ప్రధాని ఆఫీస్ ఇతనికి ఎందుకు చేసింది.. అసలు అతను ఎవరు.. అతని స్థాయి ఏంటి..? చేసేది ఒక సీరియల్.. దానికి ఇంత షో ఎందుకు.. అనేది కూడా ఎవరికి అంతుబట్టలేదు. ఇక తాజాగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రధాని ఆఫీస్ ని అతనికి శుభాకాంక్షలు చెప్పారా అని అడిగితే మేము అసలు అతనికి ఫోన్ చెయ్యలేదు అని స్పష్టం చేసింది.. ఎవరికి కలుపుతాడు పులిహోర.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే కనిపెట్టేస్తారు అని ప్రధాని పేరు చెప్పి ఉండొచ్చు..

ఇక అతను ఎక్కడికి వెళ్ళినా అభిమానులు బ్రహ్మరధం పట్టడంతో బాబు మరింత రెచ్చిపోయి.. రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని ఆలోచిస్తా అని ఒక వెర్రి ప్రకటన చేసాడు. దాని కంటే ప్రముఖ ఛానల్ నిర్వహించే ఒక ఇంటర్వ్యులో నా అభిమానులు సినిమా చూస్తే.. పక్కాగా హిట్ అవుతుందని కోనా వెంకట్ చెప్పాడని ఒక పులిహోర కలిపాడు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు హిట్ అవ్వలేదు.. బాలకృష్ణ సినిమాలు ఎందుకు హిట్ అవ్వలేదు. ముక్కు మొహం తెలియని ఇలాంటి వాళ్ళను తీసుకొచ్చి జనం మీద రుద్దితే వాళ్ళ పిచ్చితో టీవీ చానళ్ళకు పాపులారిటి తప్పించి మరొకటు ఉండదు. అతను ఇకనైనా తగ్గి ఉంటె మంచిది లేదా ఫ్లవర్ అవ్వడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. ఇప్పటికే ముప్పావు వంతు అయ్యాడు.

Leave a Reply

*