మంగళగిరిలో వైసీపీ నేత కృష్ణారెడ్డి గన్‌మెన్ల అరాచకం

మంగళగిరిలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గన్‌మెన్లు రెచ్చిపోయారు. కృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న కారుకు అడ్డు వచ్చారని ఇద్దరు జర్నలిస్టులపై అరాచకానికి పాల్పడ్డారు. కృష్ణారెడ్డి సమక్షంలోనే జర్నలిస్టులపై గన్‌మెన్ల దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఇద్దరు జర్నలిస్టుల సెల్‌ఫోన్లను లాక్కెళ్లారు. అంతేకాదు చంపేస్తామని బెదిరించారు. దీంతో గన్ మెన్లపై బాధిత జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కృష్ణారెడ్డి గన్‌మెన్లు కావడంతో పోలీసులు.. తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాధిత జర్నలిస్టులు అంటున్నారు. కృష్ణారెడ్డి అండతోనే ఇద్దరు గన్‌మెన్లు రెచ్చిపోయారని చెబుతున్నారు. గన్‌మెన్ల తీరును ఖండిస్తూ జిల్లాకు చెందిన జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వైసీపీ నేత కృష్ణారెడ్డి గన్‌మెన్లపై చర్యలు డిమాండ్ చేశారు.

Leave a Reply

*