ఎన్టీఆర్ ఉన్నా అదే చేసేవారు..? చంద్రబాబు నిర్ణయానికి క్యాడర్ ఫుల్ సపోర్ట్..!!

ఢిల్లీ పాలకుల నిర్లక్ష్యానికి, అరాచకానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటై అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ మరోసారి అదే పాత్రలోకి వచ్చింది. దేశంలో బిజెపి నిరంకుశత్వాన్ని, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో బిజెపియేతర రాజకీయ పక్షాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు నడుం కట్టారు. టీడీపీ అంతర్గతంగా నిర్వహిచుకున్న సర్వేలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు సుమారు 10వేల మంది పాల్గొన్నారు. ఇందులో 83శాతం మంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఢిల్లీలో బిజెపిని గద్దె దించేందుకు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కాంగ్రెస్ తో కలుపుకుని ఒక కూటమిని ఏర్పాటు చేయడం మంచిదేనని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, రాష్ట్ర విభజన జరిగిన తీరును నిరసించిందని అందువల్లనే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతయ్యాయి.

కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి, నిరంకుశత్వాన్ని, పెత్తందారీ తనాన్ని ఎదిరించి ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం ఎన్టీఆర్ నేర్పించారని చంద్రబాబు చెబుతున్నారు. గోద్రా అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీయేనని, ట్రిపుల్ తలాక్ కు మద్దతు ఇవ్వబోమని ఖరాఖండీగా చెప్పింది టిడిపినే. నమ్మినవాళ్లను నరేంద్ర మోదీ మోసం చేశారని, దేశం మొత్తం అసహనం పెరిగిపోయిందని, ప్రశ్నించే గొంతునే నులిమేస్తున్నారు. ప్రత్యర్ధులు నాశనం కావాలనే వైఖరితో నరేంద్రమోదీ ఉన్నారు. బిజెపిని ఎదుర్కోలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతామని, రాజకీయ అనివార్యత వల్లనే బిజెపిపై పోరాటం ప్రారంభించామని టీడీపీ క్యాడర్‌కు సందేశం వెళ్తోంది. చంద్రబాబు ప్రయత్నాలకు.. టీడీపీ క్యాడర్ అంతా సపోర్ట్ గా నిలిచింది.

అప్పుడెప్పుడో… ఫలనా వ్యక్తి శత్రువని.. జీవితాంతం.. వాళ్లతోనే పోరాడుతారా..? కొత్తగా తయారైన శత్రుని ఎదుర్కొంటారా..? పాత శత్రువు ఇప్పుడు రేసులో లేనప్పుడు.. అతనికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి.. అతనికి వ్యతిరేకంగానే పోరాడాలన్న రూల్ ఎక్కడైనా ఉందా..? అంతా విచిత్రమైన వాదనలు చేస్తూంటారు.. కానీ ఇలాంటి వాళ్లంతా.. టీడీపీ నేతలు కాదు.. టీడీపీ నేతలు మాత్రం.. కాంగ్రెస్ తో కలవడాన్ని సమర్థించారు.. కానీ ఇతరులు మాత్రం… విమర్శలు చేస్తున్నారు. వాళ్లెప్పుడూ టీడీపీకి ఓటేసిన వాళ్లు కాదు.

Leave a Reply

*