తంతాం.. తన్ని తగలేస్తాం..! ఈ రేంజ్‌లో మోడీని గౌరవించాలా పవన్..?

పవన్ కల్యాణ్.. ప్రధానమంత్రి మోడీపై.. ఎక్కడ లేని గౌరవం చూపిస్తున్నారు. ఆయనను బూతులు తిడుతున్నారని ఫీలవుతున్నారు. తుని ప్రచార సభలో ధర్మపోరాటం పేరుతో బూతులు తన ట్టడం తప్పు అని తేల్చి చెప్పారు. మోడీని గౌరవించి మాట్లాడి సాధించుకోవాలని కూడా సలహా ఇస్తున్నారు. ఎంత గౌరవించాలి.. ఎలా గౌరవించాలో కూడా పవన్ కల్యాణ్ చెబితే బెటర్‌గా ఉంటుందేమో..?. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేస్తారని.. నాలుగేళ్ల పాటు.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన గౌరవం కనిపించలేదా..?. గుజరాత్ సీఎంగా… మోడీ ఉన్నప్పుడే… ప్రధానమంత్రుల్ని… నియమించిన చంద్రబాబు .. మోడీ ప్రధాని అయిన తర్వాత తగ్గలేదా..? ఆయనపై పెత్తనం చేయలేదు కదా..?. ప్రధానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చి.. ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నించారు కదా..?.

ఆ సమయంలో ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోక.. హామీలు అమలు చేయక.. తమిళనాడు తరహ రాజకీయాలకు కుట్ర చేయబట్టే కదా.. చంద్రబాబు ఇప్పుడు బయటకు వచ్చి పోరాటం ప్రారంభించారు. అయినా మోడీని తిడితే.. పవన్ కల్యాణ్‌కు అంత రోషం ఎందుకు వస్తుంది..? ఆయనేమీ బాబాయ్ కాదు కదా..!?. ఏపీని మోసం చేసిన వ్యక్తే కదా..! ధర్మపోరాట దీక్షల్లో మోడీని బూతులు తిడుతున్నారని.. గౌరవం ఇవ్వాలని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఆ గౌవరం ఏ స్థాయిలో ఉండాలి..?. అదేదో సినిమా సీన్ ఉన్నట్లు… కాళ్ల మీద పడిపోయే గౌరవం..ఇవ్వాలా..?. సగం వండి విజ్ఞప్తి చేసుకోవాలా..? కాస్త వంగి బతిమాలుకునే గౌరవం ఇస్తే సరిపోతుందా..? లేక జనసేన స్టైల్లో.. తాట తీస్తాం.. తోలు తీస్తాం.. తన్ని తగలేస్తాం.. స్టైల్లో ఇస్తే సరిపోతుందా..?.

ఆవేశం పేరుతో గాల్లో పిడి గుద్దులు గుద్ది… గుండెలు బాదుకుని.. ఇష్టం వచ్చినట్లు అరిస్తే అది రాజకీయం కాదు. అలా అని.. రాజకీయాల్లో విమర్శలు చేయకుండా ఉండరు. ప్రతీ దానికి ఓ పద్దతి ఉంటుంది. మోడీని సమర్థించాలనుకుంటే.. టీడీపీ తిట్టింది .. విమర్శించడం… బీజేపీతో ఏ మాత్రం సంబంధం లేని జనసేనానికి ఎందుకు..?. మోడీకి కొమ్ము కాస్తూ.. సొంత రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా… ఎందుకు రాజకీయం చేస్తున్నారో ఆయనకే తెలియాలి.

Leave a Reply

*