31 రాత్రి బాగా తాగేవారికి పోలీసుల బంపర్ ఆఫర్!

గడిచిపోయిన సంవత్సరం అంతా కూడా ఎన్నో జయాపజయాలు, బాధలు, ఆవేదనలు, ఆక్రోశాలతో నిండిపోయి ఉన్నటువంటి కొందరు యువత డిసెంబర్ 31 రాగానే ఆరోజు రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి, ఎంతో ఆనందంగా 2019 కి వీడ్కోలు చెబుతూ, 2020 కి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. అయితే అంతలా మద్యం సేవించిన వారు ఊరకనే ఉండకుండా రోడ్లపై పలు విన్యాసాలు, రాష్ డ్రైవింగ్ చేస్తూ, ఇతరులకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తారు. వారి వల్ల కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా ఎక్కువవుతాయి. కాగా ప్రత్యేకంగా అలాంటి వారికి పోలీసులు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు.

కాగా ఆరోజు రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపే చోదకులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు మన పోలీసులు… ఈమేరకు కొన్ని ప్రత్యేకంగా కొన్ని బృందాలను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు కూడా. కాగా ఎవరైతే మద్యం సేవించి వాహనాలను నడుపుతారో, వారిపై 10 వేల రూపాయల భారీ జరిమాన విధించడంతో పాటు వాహానాన్ని సీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా ఈనేపథ్యంలో సామజిక మాంద్యమాల్లో కూడా ఒక వినుత్నమైన పోస్టర్ దర్శనమిస్తుంది. “31 రాత్రి మీరు బాగా తాగండి, ఆ తరువాత ఫైన్ మేము కట్టించుకుంటాం” అంటూ పోలీసులు పోస్టు చేశారు. ఇలాగైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుతాయేమో, లేదా జనవరి 1 న ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ సెలెబ్రిటీలుగా మారుతారో చూడాలి మరి…

Leave a Reply

*