నేనే ఏ తప్పూ చేయలేదు – RRR

రాజ్యాంగాన్ని పరిరక్షించే కోణంలోనే తాను మాట్లాడానని, తాను ఎటువంటి తప్పూ చేయలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సమావేశమయ్యారు. తాను చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ కార్యకలాపాలపై చర్చించానని.. సలహాలు, సూచనలు తీసుకున్నానని మీడియాకు వెల్లడించారు. అయితే తనపై వైసీపీ బృందం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు తప్పుడు ఫిర్యాదు చేసిందని కేంద్ర మంత్రికి ఆయన చెప్పినట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమించాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్రప్రభుత్వానికి సహేతుకమైన దిశానిర్దేశం చేశారని రఘురామకృష్ణంరాజు ప్రశంసించారు. ఆయన ఆదేశాలను ప్రభుత్వం సవాల్‌ చేయదని భావిస్తున్నట్లు బుధవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

*