జగన్ కు రఘురాం కృష్ణమరాజు సీరియస్ లేఖ

కరోనా విజృంభణ నేపథ్యంలో సెప్టెంబరు 5నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయాలని వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు ఆదివారం లేఖ రాశారు. కరోనా ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తోందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండే పిల్లలు బడికి వెళ్లడం వల్ల వైరస్‌ బారినపడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలో బౌద్ధారామం ఉన్న కాపులుప్పాడ తొట్లకొండ ప్రాంతాన్ని కాపాడాలని, అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరగకుండా నిషేధించాలని రఘురామకృష్ణంరాజు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌కు లేఖ రాశారు. కాపులుప్పాడలో ప్రముఖుల(వీవీఐపీ, వీఐపీ)కోసం భారీఎత్తున అతిథిగృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, ఆ నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు.

Leave a Reply

*