బయటికొచ్చిన రియా కాల్‌డేటా.. షాకింగ్ విషయాలు బట్టబయలు..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తికి సంబంధించిన కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ జాతీయ వార్తా ఛానల్ రియా కాల్ డేటాను బయటపెట్టింది. జనవరి 20 నుంచి జనవరి 24 మధ్య సుశాంత్‌‌కు రియా 25 ఫోన్‌కాల్స్ చేసినట్లు తెలిసింది. 5 రోజుల వ్యవధిలో రియా అన్ని సార్లు ఫోన్ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియా ఫోన్ చేసిన సమయంలో సుశాంత్ ఛండీగర్‌లో తన సోదరితో ఉన్నట్లు సమాచారం.

నవంబర్ 2019లో కూడా సుశాంత్ ఛండీఘర్‌లో ఉన్న తనను రియా తిరిగి రావాల్సిందిగా బ్లాక్‌మెయిల్ చేస్తోందని, సాయం కోసం ఫోన్ చేసినట్లు తెలిసింది. సుశాంత్ డిసెంబర్ 2019లో మొబైల్ నంబర్ మార్చినట్టుగా జాతీయ మీడియా ఛానల్ చెప్పింది. ఈ నంబర్ నుంచి సుశాంత్ తన కుటుంబానికి ఫోన్ చేసి రియా, ఆమె కుటుంబం తనను మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని చూస్తున్నారని, తనకు చేరడం ఇష్టం లేదని చెప్పినట్లుగా జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. అంతేకాదు, ముంబైకి గుడ్‌బై చెప్పి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎక్కడో ఒకచోట ఉంటానని కుటుంబ సభ్యులతో సుశాంత్ చెప్పినట్లు తెలిసింది. బాంద్రాలోని తన నివాసంలో జూన్ 14న సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐ విచారణకు స్వీకరించింది.

Leave a Reply

*