ఫోటో షూట్ కోసమేనా అంబులెన్స్‌లు ?

108 వాహ‌నం న‌డుపుతూ నగరి ఎమ్మెల్యే రోజా ‌ ఫోటోల‌కు ఫోజ్ ఇచ్చిన తీరుపై సోష‌ల్ మీడియాలో తీవ్ర‌మైన విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఫోటో షూట్‌ల కోసం అంబులెన్సులను వాడుకోవ‌డమేంట‌ని ప‌లువురు తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. సీఎం జ‌గ‌న్ రాష్ట్ర‌వ్యాప్తంగా ఓసారి ఈ వాహ‌నాల‌ను ప్రారంభించిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌త్యేకంగా ఈ ప్రారంభోత్స‌వాల హ‌డావుడి ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎమ‌ర్జెన్సీ వాహ‌నాల‌ని చెప్తూనే.. ఇంకా ఎన్ని రోజులు వాటిని ప్రారంభించ‌కుండా ఆల‌స్యం చేస్తార‌ని కామెంట్లు చేస్తున్నారు.

 

మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మ‌రో అడుగు ముందుకేసి… తీవ్ర‌మైన కామెంట్లే చేస్తున్నారు. బాధ్య‌తాయుత‌మైన స్థానంలో ఉండి.. కనీసం మాస్క్ కూడా పెట్టుకోక‌పోవ‌డ‌మేంట‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంద‌రు అంబులెన్స్ న‌డిపేందుకు రోజాకు లైసెన్స్ ఉందాని అని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి రోజా అంబులెన్స్ న‌డ‌ప‌డంపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో .. ఆమెపై భారీ పంచులే పేలుతున్నాయి

Leave a Reply

*