ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి బయ్ బయ్…!

సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి అన్ని సిద్దం చేసుకున్నారు, తరువాత తన రాజకీయ భవిష్యత్తు పై కూడా క్లారిటీ గానే ఉన్నారు, చంద్రబాబు కు కూడా ఆ సంకేతాలు అందించారు. ఇక చంద్రబాబు సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికలలో సర్వేపల్లి నుండే పోటీచేసి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డ్డి మీద ఐదువేల మెజార్టీతో ఓడిపోయారు. అయినా చంద్రబాబు సోమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈసారి గెలుపు తధ్యం అన్న మాట ప్రజల్లో కూడా వినిపించడం తో సోమిరెడ్డి ధీమా గా ఉన్నారు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటం తో అన్ని పార్టీ ల నుండి జుంపింగ్ లు ఎక్కువగా జరుగుతున్న నేపధ్యం లో వంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు వైకాపా కు రాజీనామా చేసారు, వారు తెలుగుదేశం లో చేరడానికి కూడా సిగ్నల్స్ ఇచ్చారు.

సోమిరెడ్డి కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఆయన ఇన్నిరోజులు ప్రజల్లో కలియతిరగడం తో ఈసారి గెలుపు నల్లేరు పై నడక అని అర్ధం అయ్యింది, చంద్రబాబు కూడా గెలుపు గుర్రాలను మాత్రమే పార్టీ లోకి తీసుకుని నెల్లూరు లో పోయినసారి కన్నా ఎక్కువ సీట్ లు రాబట్టడానికి ప్రయిత్నాలు చేస్తున్నారు, ఎలాగు మంత్రి అయ్యిన సోమిరెడ్డి కి ఈసారి కూడా మాత్రి పదవి దక్కడం కాయం. ఇంకా సోమిరెడ్డి పెర్ఫార్మన్స్ ని బట్టి ఏ మంత్రి పదవి కట్టబెడతారో చూడాలి. నెల్లూరు నుండి మంత్రి నారాయణ కూడా ఈసారి గట్టిగానే కృషి చేస్తున్నారు. మంత్రి నారాయణ తో కలిసి ఈసారి నెల్లూరు జిల్లాలో మరిన్ని సీట్ లు సాదించి చూపించడానికి సోమి రెడ్డి అందరిని కలుపుకుని పోతున్నారు.

Leave a Reply

*