యామిని శర్మపై కేసును కొట్టేయండి: సోము వీర్రాజు

బీజేపీ నాయకురాలు యామిని శర్మపై టీటీడీ కేసు పెట్టడాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా తప్పుపట్టారు. కేసును ఉపసంహరించాలంటూ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌ను డిమాండ్ చేశారు. అయోధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా 250కి పైగా ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయని, ఎస్వీబీసీ మాత్రమే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ వర్గాలకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటేనే మనస్సుకు బాధ కలుగుతోందన్నారు. ఈ అంశంపై చాలా మంది బీజేపీ నాయకులు మాట్లాడారని అన్నారు. యామిని శర్మపై కేసు పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. యామిని శర్మపై పెట్టిన కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహకరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Leave a Reply

*