రేపు ఎన్టీఆర్ వర్ధంతి… అమరావతి ర్యాలీ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ నేతలు శనివారం భారీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇదే క్రమంలో… ఆయన వర్ధంతితోపాటు… రాజధాని అమరావతికి మద్దతుగా కూడా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం 9-30 గంటలకు పొట్టిపాడు రోడ్డు కూడలిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరుగుతుందని మాజీ శాసనసభ్యుడు మల్లెల లింగారెడ్డి వెల్లడించారు. వర్ధంతి కార్యక్రమం అనంతరం… ‘రాజధాని అమరావతి’కి మద్దతుగా పట్టణంలో మోటార్ సైకిళ్ళ ర్యాలీ జరుగుతుందని […]