భయం భయం : 24 గంటల్లో 351 కేసులు

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 351మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తాజా కేసుల్లో రాష్ట్రంలోని వారు 275మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50మంది, విదేశాల నుంచి వచ్చిన 26మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో స్థానికంగా 5,555మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,253మంది, విదేశాల నుంచి వచ్చిన 263మంది కరోనా బారినపడ్డారు. బుధవారం కర్నూలులో ఒకరు, గుంటూరులో మరొకరు […]