కరోనా మరణాలు: డేంజర్ లో ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఒకటితో మొదలైన కరోనా మరణాలు ఏకంగా ఐదు వేల మార్కును దాటేశాయి. కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలోనూ ఇన్ని మరణాలు సంభవించలేదు. మంగళవారం మరో 69 మంది కరోనాతో మరణించగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 5,014కి చేరుకుంది. జూన్‌ మొదటి వారం నుంచి కరోనా మరణాల సంఖ్య రెట్టింపయింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర (29,894), తమిళనాడు(8,434), కర్ణాటక(7,384) తర్వాత అత్యధిక మరణాలు ఏపీలోనే నమోదయ్యా యి. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల్లో […]

టీటీడీలో ఒక్కరోజే 11మంది అర్చకులకు కరోనా పాజిటివ్

తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులు కరోనా బారిన పడుతున్నారు. టీటీడీలో నిన్న ఒక్క రోజే 11మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నిన్నటి వరకు మొత్తం 15 మంది అర్చకులకు వైరస్ సోకింది. అర్చకులను వెంటనే శ్రీనివాసం క్వారంటైన్‌కు తరలించారు.

ఏపిలో రాపిడ్ స్పీడ్ తో పెరుగుతున్న కరోనా

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1608 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 1576 కాగా.. 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొవిడ్‌తో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో […]

భయం భయం : 24 గంటల్లో 351 కేసులు

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 351మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. తాజా కేసుల్లో రాష్ట్రంలోని వారు 275మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 50మంది, విదేశాల నుంచి వచ్చిన 26మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో స్థానికంగా 5,555మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1,253మంది, విదేశాల నుంచి వచ్చిన 263మంది కరోనా బారినపడ్డారు. బుధవారం కర్నూలులో ఒకరు, గుంటూరులో మరొకరు […]