హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూజిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

హైకోర్టుపైనే బీజేపీ ఆరోపణలు..! అగ్రిగోల్డ్ పై బీజేపీ నేతలు చిక్కుల్లో పడ్డారా..?

అగ్రిగోల్డ్ విషయంలో బీజేపీ కోర్టుల్ని అనుమానిస్తోంది. హైకోర్టు పరిధిలో ఉన్న అంశంపై.. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసతోంది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల సేకరణ రూ. మూడు, నాలుగు వేల కోట్ల రూపాయల దరిదాపుల్లో ఉంటుంది. ఆ సంస్థకు అనేక రాష్ట్రాల్లో ఆస్తులున్నాయి. విజయవాడ – గుంటూరు మధ్య ఉన్నహాయ్ ల్యాండ్ అగ్రిగోల్డ్ దే. అయితే వాటి మీద అప్పులు ఉన్నాయి. ఇలా ఆస్తులు, అప్పులు.. అన్నీ తీసేసుకుని… డిపాజిటర్లకు చెల్లించాల్సింది చెల్లిస్తే చాలన్న ప్రతిపాదనతో ప్రభుత్వం ఎవరైనా వస్తారేమోనని […]

హైకోర్టు విభజన మాత్రమేనా..? మిగతా సమస్యలు ఎందుకు పరిష్కరించరు..?

ఉమ్మడి హైకోర్టును ఉన్న పళంగా విభజించాలనే ఆత్రం.. కేంద్ర ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కేంద్రం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడున్న భవనంలో కానీ వేరే భవనాల్లో ఏపీ, తెలంగాణకు హైకోర్టులు..ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హైకోర్టు ఏపీ భూభాగంలోనే ఉండాలని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కొట్టి వేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కేంద్రం […]

కేసిఆర్ సర్కార్ పై హై కోర్టు ఆగ్రహం.. ! వారం డెడ్ లైన్!!

ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు అంశం.. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి రాను రాను తలనొప్పిగా మారుతోంది. ఎలా సమర్థింుకోవాలో తెలియక.. సైలెంట్ గాఉండటం కూడా.. అనేక చిక్కులు తెచ్చి పెడుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున… కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్… శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పై దాడి చేశారంటూ.. వారి సభ్యత్వాలను స్పీకర్ మధుసూదనా చారి రద్దు చేశారు. రాత్రికి రాత్రి వారి అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించారు. […]

ఐవైఆర్‌ టాస్క్ ఇప్పుడు రాయలసీమలో హైకోర్టు..! బిగ్ బాస్ ఇచ్చాడు మరి..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తగా వ్యవహరిస్తున్న మాజీ చీఫ్ జస్టిస్ ఐవైఆర్ కృష్ణారావు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. రాయలసీమలో హైకోర్టు పెట్టారట.ఆయనను వెనకుండి నడిపిస్తున్న బిగ్ బాస్ .. ఐవైఆర్‌కు అమరావతిని ఎలా విచ్చిన్నం చేయాలనే టాస్క్‌లో భాగంగా.. ఈ కొత్త టాస్క్ అప్పగించారు. అమరావతిలో అన్నీ ఉంటే.. అధికార వికేంద్రీకరణ ఎలా సాధ్యమనేది.. ఈ మాజీ మాజీ పాలనా నిపుణుడి అభవనంతో వేస్తున్న ప్రశ్న. ఇప్పుడీ ఈ టాస్క్ ను బిగ్‌బాస్ […]