కరోనా మరణాలు: డేంజర్ లో ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో కరోనా మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. ఒకటితో మొదలైన కరోనా మరణాలు ఏకంగా ఐదు వేల మార్కును దాటేశాయి. కరోనా వైరస్‌ పుట్టినిల్లు చైనాలోనూ ఇన్ని మరణాలు సంభవించలేదు. మంగళవారం మరో 69 మంది కరోనాతో మరణించగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 5,014కి చేరుకుంది. జూన్‌ మొదటి వారం నుంచి కరోనా మరణాల సంఖ్య రెట్టింపయింది. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర (29,894), తమిళనాడు(8,434), కర్ణాటక(7,384) తర్వాత అత్యధిక మరణాలు ఏపీలోనే నమోదయ్యా యి. వాస్తవానికి ప్రభుత్వ లెక్కల్లో […]

సీఎం జగన్‌కు చుక్కెదురు.. సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చి సీబీఐ కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. విచారణలో ఉన్న ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ విచారణ పూర్తయ్యేంత వరకూ ఈడీ విచారణ చేపట్ట రాదన్న జగన్ పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసును శుక్రవారం విచారణ […]

సచివాలయ పరీక్షా రిజల్ట్ లో గోల్ మాల్ !

అవునండి నిజమే, ఆంధ్రప్రదేశ్ ప్రదుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షలో పేపర్ లీక్ గురించి కొద్దిరోజులుగా దుమారం లేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా ఫలితాలు రావడం తో మరొక విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామ సచివాలయం పరీక్షలో గుంటూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంపీటీటేషన్ విద్యార్థికి అన్యాయం జరిగింది.  ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగానికి రమ్య అనే విద్యార్థిని ఈ నెల 7న పరీక్ష రాసింది. అక్కడవరకు బాగానే ఉంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కీ […]

బీజేపి నెక్స్ట్ టార్గెట్ వైకాపా కాబోతుందా ?

బీజేపి భారతదేశం అంతా తన అధికారాన్ని చూపడానికి ప్రతి రాష్ట్రానికి తనదైన శైలి లో ఎత్తుగడలు వేస్తూ ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వైకాపా నే తమ టార్గెట్ అన్నట్లు ఆంధ్రా బీజేపి నాయకులూ కూడా డైరెక్ట్ గానే వైకాపా ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరం అయ్యిన విషయం ఏంటి అంటే దానికి వైకాపా నాయకులూ ఎవరి దగ్గరనుండి కూడా సమాధానం రావడమ లేదు. చూడబోతే బీజేపి కి తలవంచినట్లు కనపడుతున్నా వారు […]

ప్రాణాలు కాపాడే 108కు దిక్కెవరు ?

ఎలాంటి సమస్య వచ్చిన ఏ రాత్రి అయ్యినా 108 కి ఫోన్ కొడితే టక్కున వచ్చి ప్రాణాలు కాపాడే 108 ఉద్యోగుల మాట వినే అధికారాలు లేరు, కాంట్రాక్టు వర్కర్స్ గా ఉన్న తమని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలని24 గంటలు సేవలు అందిస్తున్న తమని పట్టించుకోక పోవడం సబబు కాదని వారి వాదన. వెంటనే తమ డిమాండ్ లను పరిశీలించాలని సోమవారం రాత్రి మెరుపు సమ్మెకు దిగారు. ఇప్పిటికే కొందరు అధికారాలు వారి యూనియన్ లతో మాట్లాడిన […]

ఆంధ్రప్రదేశ్ ను కౌగిలించుకోనున్న కరువు !

కరువు ఆ పేరు విని తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం అయ్యింది, రాయలసీమ వంటి చోట కూడా గత నాలుగు ఏళ్ళలో వర్షాలు పడ్డాయి, చెరువులకు నీళ్ళు వచ్చాయి. హార్టికల్చర్ లో ఆంధ్రప్రదేశ్ ను అగ్ర స్థానం లో ఉంచిన పరిస్థితులు కూడా చూసాం. కానీ గత ఈసారి కరువు సూచనలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఎక్కడా వర్షాలు లేవు, ప్రాజెక్ట్ లలో నీళ్ళు లేవు, బోర్లు బావులు తో పండిద్దాం అంటే విత్తనాల కొరత, ఒక వేల […]

టిక్కెట్లపై హామీ ఇవ్వను..! ఆనంకు హ్యాండిచ్చిన జగన్..!

నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంత వరకూ ఆయన పార్టీలో చేరలేదు. కారణం ఏమిటంటే.. జగన్ టిక్కెట్ల హామీ ఇవ్వకపోవడమే . తనకు, వివేకా కుమారునికి.. అసెంబ్లీ టిక్కెట్లు ఖరారు చేసి.. చేరిక సమయంలోనే ప్రకటించాలని ఆనం రామనారాయణరెడ్డి పట్టుబడుతున్నారు. కానీ జగన్ మాత్రం.. అసలు టిక్కెట్లపై హామీ ఇవ్వలేను.. ఇప్పటికి పార్టీలో చేరిపోవాలని సూచిస్తున్నారు. కానీ ఆనం మాత్రం టిక్కెట్లపై హామీ ఇవ్వకుండా… పార్టీలో ఎలా చేరాలంటూ […]

వైసీపీకి బీజేపీకి మరణశానసం..! ఎంపీల రాజీనామాల ఆమోదానికి రెడీ..!!

ఉపఎన్నికలు రాకుండా ఉంటేనే రాజీనామా చేస్తామన్నారు వాళ్లు. సరే అన్నారు వీళ్లు. రాజీనామాలు ఆమోదించినా.. ఉప ఎన్నికలు రానే రావని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఉపఎన్నికలు తీసుకొచ్చి.. సాధారణ ఎన్నికల ముందే.. వైసీపీని ఫినిష్ చేయాలని నిర్ణయించారు. ఆ స్థానంలోకి తాము రావాలని డిసైడయ్యారు. వాళ్లే బీజేపీ నేతలు. ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన రాజీనామా లేఖలిచ్చిన వైసీపీ ఎంపీలను ఢిల్లీకి పిలిపిస్తున్నారు స్పీకర్ సుమిత్రామహాజన్. ఆ తర్వాత ఎప్పుడైనా వారి […]

శభాష్.. జగన్ పేరు నిలబెట్టారు..! జగన్‌ సెక్యూరిటీకి ప్రశంసలు..! ఏం చేశారో తెలుసా..?

“దొంగ.. దొంగ” అనే అరుపులతో పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్రలో కాసేపు గందరగోళం నెలకొంది. అదేదో సినిమాలోలా తననే అంటున్నారేమో అనుకుని పెద్ద మనిషి కాస్త కంగారు పడ్డారు కానీ.. తర్వాత స్థిమితపడ్డారు. పెంటపాడు దగ్గర సాగుతున్న పాదయాత్రలో దొంగ..దొంగ అనే అరుపులు వచ్చింది ..ది లీడర్ గురించి కాదు… ఆయన అనుచరులు సెక్యూరిటీ గురించి. జగన్‌ పాదయాత్రగా వస్తున్నాడు అంటే .. కొంత మంది మహిళలు, వైసీపీ కార్యకర్తలు చూడటానికి వెళ్లారు. తీరా చూస్తే.. […]

నెలాఖరులో వైసీపీ ఎంపీల రాజీనామాల ఆమోదం..? ఏపీలో ఉపఎన్నికలు..!

కర్ణాటకలో అక్కడి ప్రజలు కొట్టిన చావు దెబ్బ నుంచి బీజేపీ పాఠాలు నేర్చుకోలేదు. ఇప్పుడు గుణపాఠాల కోసం సిద్దమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సెగ ఎగోసేందుకు.. ఉపఎన్నికలు తీసుకొచ్చి పెట్టాలని డిసైడయిపోయింది. ఇందుకు వైసీపీ పావుగా దొరికిది. ఏపీలో ఏదో ఓ పార్టీని ఫినిష్ చేయాలంటే… తాను ఆ ప్లేస్‌ను ఆక్రమించాలంటే.. ఇప్పుడు ఉపఎన్నికలు తెచ్చి పెట్టడమే బెటరని డిసైడయింది.అందుకే.. వైసీపీ ఎంపీల రాజీనామాలపై ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన నిర్ణయం తీసుకోబోుతన్నారు. సహజంగా రాజీనామాలు ఆమోదించకపోవడానికి […]