హైదరాబాద్ వాహనదారులకు పోలీసుల షాక్ ?

మరికొద్ది గంటల్లో రానున్నటువంటి 2020 నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకొని హైదరాబాద్ నగర పోలీసులు, నగరంలోని వాహన దారులందరికి కూడా ఒక ఘోరమైన షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాగా ఈ మేరకు నేడు హైదరాబాద్ నగరంలోని ఫ్లై ఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్లు, ప్రధాన రహదారులు, అన్నింటిని కూడా రద్దు చేస్తూ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు హైదరాబాద్ నగర పోలీసులు… అయితే ఈ నిర్ణయానికి సంబందించిన రూల్స్ అన్ని కూడా నేటి అర్థరాత్రి 11 గంటల […]

పట్టిస్తే రూ.4కోట్ల కోట్లు ఇస్తారట

జర్మనీ డ్రెస్డెన్ మ్యూజియంలో భారీ దోపిడీకి పాల్పడిన నిందితుల కోసం ఇక్కడి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు కిటికీ అద్దాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించినట్టు రికార్డయింది. అలా లోపలకు వచ్చిన వారు.. మ్యూజియంలో కరెంట్ కట్ చేసి అక్కడ ఉన్న విలువైన ఆభరణాలను దొంగిలించారు. ఈ దోపిడీలో సుమారు రూ.8వేలకోట్ల విలువ చేసే ఆభరణాలు పోయినట్లు మ్యూజియం అధికారులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దోపిడీ జర్మనీలో కలకలం రేపింది. […]

జియో యూసర్లకు మరో శుభవార్త

భారత్​లో డేటా విప్లవానికి నాంది పలికిన నెట్​వర్క్​ రిలయన్స్ జియో. ఇతర నెట్​వర్క్​లకు కాల్ చేసేందుకు నిమిషానికి 6 పైసలు వడ్డింపుతో వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొందీ సంస్థ. కొంతమంది వినియోగదారులు జియోను వదిలేస్తున్న విషయాన్ని గమనించి నష్ట నివారణ చర్యల వైపు అడుగులు వేసింది. డేటాతో పాటు ఇతర నెట్​వర్క్​లకు కాల్​ చేసేందుకు ఉచితంగా వెయ్యి నిమిషాల బ్యాలెన్స్​ అందిస్తూ నూతన టారిఫ్ ప్లాన్లు ప్రకటించింది. కొత్త టారిఫ్ లు ఇవే మూడు నెలలపాటు […]

ఒక్కసారి కన్ను కొడితేనే సన్నీ లియోన్ ని దాటేసింది బాబోయ్

నాలుగేళ్ల రికార్డును కేవలం నాలుగు రోజుల్లో బ్రేక్ చేసింది. నిన్నటివరకు గూగుల్ సెర్చ్‌లో ట్రెండ్ సెట్ చేసిన బ్యూటీని వెనక్కి నెట్టి ముందుకు దూసుకువచ్చింది. ఒకే ఒక ఎక్స్‌ప్రెషన్‌తో ముందుకు దూసుకువెళ్లిపోయింది. కన్నుగొట్టి అందరి గుండెలు కొల్లగొట్టింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇంటర్‌నెట్‌లో సంచలనం సృష్టించింది. ప్రియా వారియర్ హడావుడి ఏ రేంజ్‌లో ఉందంటే నాలుగేళ్లుగా గూగుల్ ట్రండ్స్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్స్ రికార్డులను బ్రేక్ చేసింది. మలయాళ సినిమా ఓరు ఆడార్ లవ్‌లో ఓ పాట […]

152 ఏళ్ల తర్వాత.. రేపు ఆకాశంలో అద్భుతం!

ఆకాశంలో రేపు అత్యంత అరుదైన ఖగోళ అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ నెల 31న సూపర్‌మూన్‌గా మారే చంద్రుడు బ్లూమూన్‌, బ్లడ్‌మూన్‌గానూ దర్శనమివ్వనున్నాడు. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం జరగనుందనీ, మరో పదేళ్ల వరకు ఇలాంటి అవకాశం రాదని శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఈ ఖగోళ వింతను కెమెరాల్లో బంధించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కన్పిస్తాడు. దీన్నే […]

రోజు కూలీకి 40 లక్షల ఆదాయం షాక్ తిన్న ఐటి అధికారులు !

రోజువారీ కూలీ అంటే ఆదాయం ఎంటుంది… రోజుకు ఐదొందలు… మహా అయితే రూ.వెయ్యి. ఏడాదికైతే మూడు లక్షలు అనుకుందాం. అయితే, బెంగళూరులో రాచప్ప అనే కూలీ మాత్రం ఏకంగా ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడు. కూలీకి ఇంత ఆదాయం ఎలా సమకూరిందనే అనుమానం రావచ్చు. అందుకే మనోడు పక్కా లెక్కలతో ఐటీ రిటర్స్స్ కూడా ఫైల్ చేశాడు. కానీ ఆదాయపు పన్ను అధికారులకు దీనిపై ఎక్కడో తేడా కొట్టింది. మనిషి చూస్తే రోజువారీ కూలీ… ఆదాయం ఎలా […]

ఈ డాక్టర్ కి 175 ఏళ్ళు జైలు శిక్ష వేసారు ఎందుకో తెలుసా ?

రెండు దశాబ్దాలుగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ విభాగం మాజీ వైద్యుడు ల్యారీ నాసర్‌కు 175 ఏళ్ల వరకు కారాగార శిక్షను విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. మహిళా జిమ్నాస్ట్‌ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ డాక్టర్ ల్యారీ నాస్సర్‌కు 40 నుంచి 175 ఏళ్ల శిక్షను విధిస్తూ ఇంఘామ్ కౌంటీ సర్క్యూట్ జడ్జ్ రోస్ మేరీ ఆక్విలినా తీర్పునిచ్చారు. దాదాపు 156 మంది బాధితులను విచారించిన ఆమె, […]

విజయవాడ లో చనిపోయిన పాప మళ్ళీ బ్రతికింది.. ఎలానో తెలుసా ?

విజ‌య‌వాడ‌లో దారుణం చోటు చేసుకుంది. బ్ర‌తికున్న బాలిక‌ను చ‌నిపోయింద‌ని చెప్పారు ప్ర‌భుత్వాసుప‌త్రి వైద్యులు . అయితే అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేస్తుండ‌గా బాలిక క‌దిలింది. సాయిదుర్గ అనే చిన్నారి క‌ళ్లు తిరిగి కింద ప‌డిపోయింది. దీంతో ఆమెను ప్ర‌భుత్వాసుప‌త్రిలో జాయిన్ చేయించారు కుటుంబ స‌భ్యులు.అయితే సాయి దుర్గ చ‌నిపోయింద‌ని చెప్పారు ప్ర‌భుత్వాసుప‌త్రి డాక్ట‌ర్లు. దాంతో బాలిక‌ను ఇంటికి తీసుకెళ్లారు త‌ల్లితండ్రులు. డాక్ట‌ర్లు చ‌నిపోయింద‌ని చెప్ప‌డంతో బాలికకు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేశారు కుటుంబ స‌భ్యులు. అయితే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించే […]

స్నేహితుడి తలను నరికి..కాలువ పక్కన పాతిపెట్టారు !

ఐదుగురు యువ‌కులు మ‌రో యువ‌కుడితో గొడ‌వ‌ప‌డి హ‌త్య చేసిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులో క‌ల‌క‌లం రేపుతోంది. ఆ రాష్ట్రంలోని నాగైలో భారతి మార్కెట్‌ ప్రాంతంలో నివ‌సించే మ‌దియళగన్‌, సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ ఆడుతూపాడుతూ తిరిగేవారు. అప్పుడ‌ప్పుడు అంతాక‌లిసి మందు పార్టీ చేసుకునేవారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా గత నెల 31న రాత్రి స్థానిక‌ శ్మశానవాటిక ప్రాంతంలో సరన్‌రాజ్‌, విజయ్‌, మారియప్పన్‌, శివ, జయరామన్ మందు పార్టీ చేసుకున్నారు. త‌న‌కు క‌బురు పంప‌కుండానే త‌న మిత్రులు మందు […]

లక్షన్నర జీతాన్ని వదిలేసి స్వగ్రామంలో సేద్యం – Inspiring Story

రైతులే వ్యవసాయం వదిలేసి పట్నాలకు తరలిపోతుంటే బెంగుళూరులో ఉద్యోగాలను, లక్షన్నర జీతాన్ని వదిలేసి స్వగ్రామంలో సేద్యం చేస్తున్నారు యువ దంపతులు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఉద్యోగాల కంటే సాగు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తామంటున్న ఆ హైటెక్‌ రైతు దంపతుల స్ఫూర్తి గాథ ఇది. అనంతపురం జిల్లా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మారుమూల ప్రాంతం. ఈ గ్రామంలో పుట్టిన అభిలాష్‌, సుష్మ ఉన్నత చదువులు చదివారు. ఇద్దరూ బెంగుళూరులో 14 […]