మంగళగిరిలో వైసీపీ నేత కృష్ణారెడ్డి గన్‌మెన్ల అరాచకం

మంగళగిరిలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గన్‌మెన్లు రెచ్చిపోయారు. కృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న కారుకు అడ్డు వచ్చారని ఇద్దరు జర్నలిస్టులపై అరాచకానికి పాల్పడ్డారు. కృష్ణారెడ్డి సమక్షంలోనే జర్నలిస్టులపై గన్‌మెన్ల దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఇద్దరు జర్నలిస్టుల సెల్‌ఫోన్లను లాక్కెళ్లారు. అంతేకాదు చంపేస్తామని బెదిరించారు. దీంతో గన్ మెన్లపై బాధిత జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కృష్ణారెడ్డి గన్‌మెన్లు కావడంతో పోలీసులు.. తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాధిత […]

బిజెపిలోకి వైసీపీ ఎంపీలు…11నే ముహుర్తం ?

గోకరాజు గంగరాజు కరడుగట్టిన కాషాయవాది. కాని ఆయన ఫ్యామిలీ మాత్రం వైసీపీలో చేరింది. స్వయానా కొడుకు, సోదరులు అందులో చేరిపోయారు. దేశమంతా బిజెపి ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తుంటే.. ఇక్కడ మాత్రం బిజెపివారినే వైసీపీలోకి లాగేశారనే టాక్ మోగుతోంది. అసలు గంగరాజుగారేమిటి.. వారి ఫ్యామిలీ ఏమిటి.. వాళ్లు వైసీపీలో చేరడం ఏంటి అంటూ అందరూ షాకయ్యారు. ఈ షాకింగ్ న్యూస్ వెనక మరో షాకింగ్ న్యూస్ ఉంది. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు బిజెపిలో చేరనున్నారనేదే ఆ […]

వల్లభానేను వంశి పై తెదేపా కార్యకర్తలు ఫైర్

ఈరోజు జరిగిన వల్లభనేని వంశి ప్రెస్ మీట్ తెదేపాలో దుమారం లేపింది, నిన్నటి వరకు వంశి వెళ్తాడా వైకాపా లోకి లేదా అన్న విషయానికి ఈ ప్రెస్ మీట్ తో క్లారిటీ వచ్చింది. కాని ప్రెస్ మీట్ లో వంశి ప్రస్తావించిన విషయాలు తెదేపా కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెచ్చింది. ఒకవైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతిలేకుండా ఉన్న తరుణం లో వైకాపా ప్రభుత్వం పై అనేక విమర్శలు వస్తున్న తరుణం లో వంశి అలాగే దేవినేని అవినాష్ […]

కాంగ్రెస్ తో కూటమిపై అయ్యన్న రియాక్షన్..‍‍! క్షోభ పడేవాళ్లను మరింత క్షోభ పెడుతుందా..?

కాంగ్రెస్ తో పొత్తులపై గతంలో వివాదాస్పద ప్రకటనలు చేసిన అయ్యన్న పాత్రుడు.. తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఈ దేశాన్ని మోదీ కబలించేందుకు ప్రయత్నిస్తున్నాడని, దీన్ని అ డ్డుకునేందుకు అన్ని విపక్ష పార్టీలను ఏకం చేసి దేశాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌తో జట్టుకట్టడం పై అధిష్ఠానం నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కేవలం మోదీని అణగదొక్కడానికే అన్ని పార్టీలు ఏకమవుతున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో జతకట్టడం వల్ల టీడీపీకి ఒనగారేదేమీ లేదన్నారు. ఆ పార్టీ […]

రామచంద్రయ్య కూడా నీతులు చెబుతున్నాడే..! పవన్‌ని ముంచడానికేనా..?

సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రాజీనామా చేశారు. టీడీపీతో పొత్తుపై రాష్ట్ర నేతలతో అధిష్టానం చర్చించలేదనేది ఆయన అభ్యంతరం. ఉన్నపళంగా చంద్రబాబు పవిత్రుడని ఆయన చెప్పలేరట. అలాగే కిరణ్ కుమార్ రెడ్డితో పని చేయలేరట. ఇంతకీ ఈయన ఎవరు కాంగ్రెస్ వాదా..?. టీడీపీ వాదా..? కుల పార్టీకి వీర సైనికుడా..? కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్యకు ఇంత వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. టీడీపీలో చంద్రబాబు నాయుడు.. ప్రొత్సహించారు. […]

సర్వేల పేరుతో గొలి కొడుతున్న ఆర్నాబ్..! బీజేపీ – వైసీపీ కలుస్తాయా..?

వైసీపీకి ఇరవై పార్లమెంట్ సీట్లు వస్తాయట.. టీడీపీకి ఐదు సీట్లు వస్తాయట. ఓట్ల శాతం… రెండు పార్టీలకు పది శాతం తేడా ఉందట. కానీ.. బీజేపీకి పదకొండు, కాంగ్రెస్‌కు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయట. బీజేపీకి ఏపీలో పదకొండు శాతం ఓట్లు వస్తాయంటే.. నమ్మేవాళ్లెవరైనా ఉంటారా..? కాంగ్రెస్ పార్టీ 9 శాతం ఓట్లు చీల్చుకుంటే.. వైసీపీకి 40 శాతం ఓట్లు వస్తాయా..?. అన్నీ ప్రశ్నలే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు.. ఆర్నాబ్ అనే బీజేపీ జర్నలిస్ట్. ఈ సర్వేలు.. […]

మిత్రపక్షాలకు 24..టిడిపి కి 14! టీ కాంగ్రెస్ లెక్క చెప్పింది..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి… మహాకూటమిలో మిత్రపక్షాలకు 24 సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో టీడీపీ 14 స్థానాలు.. మిగతా పది స్థానాల్లో టీజేఎస్, సీపీఐ పోటీ చేస్తాయని ప్రకటించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థుల జాబితాను మాత్రం ఇప్పుడు ప్రకటించడం లేదన్నారు. ఈనెల 8 లేదా 9న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామన్నారు. 8న మరోసారి భేటీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ […]

తెలంగాణలోనూ టీడీపీకి ఎదురు లేదా..? లగడపాటి ఇన్ డైరక్ట్‌గా చెప్పారా..?

తెలంగాణలో.. టీడీపీ, కాంగ్రెస్ కూటమి తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎదురులేదనుకున్న టీఆర్ఎస్ ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్.. పరోక్షంగా స్పష్టం చేశారు. రాజకీయాల్లో పరిస్థితులను బట్టి అనేకమంది కలుస్తారు. ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ప్రత్యర్థులు కావు. అందుకు కలిశాయని… లగడపాటి విశ్లేషిస్తున్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను సంఘటితం చేయడం చంద్రబాబు కు కొత్తేమీ కాదని.. కూటమి గురించి పాజిటివ్ గా మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో […]

మార్ఫింగ్ లు చేస్తే నిజాలయిపోతాయా..? శ్రీనివాసరావు జగన్ ఫ్యాన్ కాకుండా పోతాడా..?

అతడు సినిమాలో సీన్ ని అత్యంత చేతకాని తనంతో రిపీట్ చేసుకుని సానుభూతి పొందే ప్రయత్నంలో అట్టర్ ఫ్లాప్ అయిన వైసీపీ నేతలు… ఇప్పుడు మార్ఫింగ్ పిక్‌లతో త మ పరపును మరింతగా తీసుకుంటున్నారు. పదే పదే దొంగ.. పిక్‌లతో… చెలరేగిపోతున్నారు. అలా .. మార్ఫింగ్‌లు చేస్తే.. పోలీసులు కేసులు పెడతామని హెచ్చరిస్తున్నా.. వైసీపీలోని ఓ స్థాయి నేతలు కూడా.. తమ వికార బుద్దిని బయటపెట్టుకున్నారు. తాజాగా.. జగన్ పై దాడి చేసిన.. వ్యక్తి పేరుతో.. ఓ […]

అదీ విషయం..! టీడీపీకి పేరు వచ్చిందనే పవన్‌కి కడుపు మంటట..!!

తుపాను సహాయ చర్యల్లో ప్రభుత్వం పడిన కష్టం ఏమిటో.. చంద్రబాబు చేసిన శ్రమ ఏమిటో.. లోకేష్… అవిశ్రాంత కృషి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. దాని కోసం… ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయలేదు. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. ఓ ప్రకృతి విలయం సంభవించినప్పుడు…అభివృద్ధి చెందిన దేశాలు కూడా.. డీల్ చేయనంత గొప్పగా… విలయాన్ని డీల్ చేశారు. తమ పార్టీ అధినేత ఇలా చేశారని..తమ పార్టీ మంత్రులు ఇలా కష్టపడ్డాలని.. తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ప్రపంచానికి చెప్పుకుంది. చేసిన […]