జగన్ కు రఘురాం కృష్ణమరాజు సీరియస్ లేఖ

కరోనా విజృంభణ నేపథ్యంలో సెప్టెంబరు 5నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేయాలని వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు ఆదివారం లేఖ రాశారు. కరోనా ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయభ్రాంతులను చేస్తోందన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండే పిల్లలు బడికి వెళ్లడం వల్ల వైరస్‌ బారినపడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలో బౌద్ధారామం ఉన్న కాపులుప్పాడ […]

ఏపీలో నిజంగా స్వాతంత్ర్యం ఉందా?: దీపక్‌రెడ్డి

జగన్ సర్కార్‌పై టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలోని ప్రజలకు నిజంగా స్వాతంత్ర్యం ఉందా? బ్రిటీషు వారు తమ స్వార్థం కోసం భారతీయులను కులం, మతం, ప్రాంతాల వారీగా విభజించి పాలించారు. జగన్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తిస్తోంది. లిక్కర్, శాండ్, ల్యాండ్, మైన్స్ వ్యాపారాల్లో ప్రభుత్వం మునిగి తేలుతోంది. పోలీసులు వైసీపీ వారికి పర్సనల్ సెక్యూరిటీ గార్డుల్లా వ్యవహరిస్తున్నారు. మీడియాపై, ప్రశ్నించేవారిపై దాడి చేస్తున్నారు. దళిత మహిళపై 10 మంది మూడు […]

ఏబీఎన్‌ ఎఫెక్ట్‌తో తోక ముడిచిన వైసీపీ నేతలు

కావలిలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేశారు. రోడ్లు కూడా వేసేసి విద్యుత్ స్తంభాల లైన్లు కూడా వేశారు. ఈ అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. రెండు రోజులుగా ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.  

నేనే ఏ తప్పూ చేయలేదు – RRR

రాజ్యాంగాన్ని పరిరక్షించే కోణంలోనే తాను మాట్లాడానని, తాను ఎటువంటి తప్పూ చేయలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషితో సమావేశమయ్యారు. తాను చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ కార్యకలాపాలపై చర్చించానని.. సలహాలు, సూచనలు తీసుకున్నానని మీడియాకు వెల్లడించారు. అయితే తనపై వైసీపీ బృందం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు తప్పుడు ఫిర్యాదు చేసిందని కేంద్ర మంత్రికి ఆయన చెప్పినట్లు తెలిసింది. కాగా, రాష్ట్ర హైకోర్టు తీర్పును […]

అచ్చెన్న చుట్టూ అసలు ఏం జరుగుతుంది ?

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత, తన చిన్నాన్న అచ్చెన్నాయుడిని ఎలాగైనా జైలులో ఉంచేందుకు జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుడిగా బాబాయి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో ఉన్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమతో కలిసి ఆయన మంగళవారమిక్కడకు వచ్చారు. ఆస్పత్రి అధికారులు అనుమతించకపోవడంతో వైద్యులను అడిగి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన పరిస్థితిపై ప్రతి రోజూ హెల్త్‌ […]

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన రఘురామకృష్ణంరాజు

కేంద్ర ఎన్నికల సంఘాన్ని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు కలిశారు. తనకు జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటుపై ఫిర్యాదు చేశారు. పార్టీ లెటర్‌ హెడ్ కాకుండా మరో పేరుతో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సంజాయిషీ కోరితే సాధారణంగా ఎవరైనా సమాధానం ఇస్తారు… కానీ, రఘురామకృష్ణంరాజు దీనికి భిన్నంగా తనకు నోటీసు పంపినవారికే ప్రశ్నలు సంధించారు. అసలు ఏ పార్టీ […]

ఏపీ డీజీపీకి చంద్రబాబు ఘాటైన లేఖ

టీడీపీ నాయకులపై తప్పుడు కేసులకు నిరసనగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటైన లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస అరాచకాలపై బాబు ధ్వజమెత్తారు. దళితులపై దాడులు- దౌర్జన్యాలు, టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు, అరెస్ట్‌లపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం…. ఇప్పుడు అయ్యన్నపాత్రుడిపై వరుసగా అనేక కేసులు పెట్టడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, […]

సీఎం జగన్‌కు చుక్కెదురు.. సీబీఐ కోర్టు షాకింగ్ డెసిషన్

సీబీఐ కేసుల్లో వ్యక్తిగత మినహాయింపు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చి సీబీఐ కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. విచారణలో ఉన్న ఐదు చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని జగన్ తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ విచారణ పూర్తయ్యేంత వరకూ ఈడీ విచారణ చేపట్ట రాదన్న జగన్ పిటిషన్‌ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసును శుక్రవారం విచారణ […]

గుంటూరులో నేపాల్ బాలికపై అత్యాచారం

ఇటీవల గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. గుంటూరులో నేపాల్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొత్తపేటలో నాలుగేళ్ల బాలికపై వేణుగోపాల్‌(40) అత్యాచారం చేశాడు. అంతేకాదు ఎవరికీ చెప్పొద్దని బాలికను వేణుగోపాల్‌ గాయపరిచాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో ఐదేళ్ల వయసున్న అభంశుభం తెలియని పాపపై తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. […]

మంగళగిరిలో వైసీపీ నేత కృష్ణారెడ్డి గన్‌మెన్ల అరాచకం

మంగళగిరిలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి గన్‌మెన్లు రెచ్చిపోయారు. కృష్ణారెడ్డి ప్రయాణిస్తున్న కారుకు అడ్డు వచ్చారని ఇద్దరు జర్నలిస్టులపై అరాచకానికి పాల్పడ్డారు. కృష్ణారెడ్డి సమక్షంలోనే జర్నలిస్టులపై గన్‌మెన్ల దాడికి దిగారు. అక్కడితో ఆగకుండా ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఇద్దరు జర్నలిస్టుల సెల్‌ఫోన్లను లాక్కెళ్లారు. అంతేకాదు చంపేస్తామని బెదిరించారు. దీంతో గన్ మెన్లపై బాధిత జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన కృష్ణారెడ్డి గన్‌మెన్లు కావడంతో పోలీసులు.. తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాధిత […]