వల్లభానేను వంశి పై తెదేపా కార్యకర్తలు ఫైర్

ఈరోజు జరిగిన వల్లభనేని వంశి ప్రెస్ మీట్ తెదేపాలో దుమారం లేపింది, నిన్నటి వరకు వంశి వెళ్తాడా వైకాపా లోకి లేదా అన్న విషయానికి ఈ ప్రెస్ మీట్ తో క్లారిటీ వచ్చింది. కాని ప్రెస్ మీట్ లో వంశి ప్రస్తావించిన విషయాలు తెదేపా కార్యకర్తలకు ఆగ్రహాన్ని తెచ్చింది. ఒకవైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతిలేకుండా ఉన్న తరుణం లో వైకాపా ప్రభుత్వం పై అనేక విమర్శలు వస్తున్న తరుణం లో వంశి అలాగే దేవినేని అవినాష్ ఎందుకు వైకాపా లో చేరారో తెలియని పరిస్థితి. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న అసహనం చూసి కూడా ఎందుకు వారు ఆ దారి ఎంచుకున్నారో వారికీ మాత్రమే తెలుసు. అయితే ఈరోజు ప్రెస్ మీట్ లో వంశి చేసిన కామెంట్స్ దుమారం లేపాయి లోకేష్ ను ఎందుకు గెలిపించుకోలేక పోయారు అంటూ చంద్రబాబు ను కారిడార్ సియం అంటూ చేసిన కామెంట్ బాగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

ఎప్పుడు తెదేపా ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకుని గెలుస్తుంది అని చేసిన కామెంట్ కి మరి ఇన్ని రోజులు అదే పార్టీ లో ఎందుకు ఉన్నట్లు ఇన్ని రోజులు గుర్తుకు రానిది ఈరోజు గుర్తుకు వచ్చిందా అని తెదేపా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు, ప్రజలే పోరాటానికి సిద్దం అయితే మీరు ఎందుకు భయపడి పార్టీ మారుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రము లో ఉన్న ఇసుక కొరత, తగ్గుముఖం పట్టిన ఆదాయం ఇవన్ని వదిలేసి ఇప్పుడు జగన్ పక్కన నిలబడతా అనడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

*