గుంటూరులో వైసీపీ ఉనికేది..? ఈ సారి టీడీపీ క్లీన్ స్వీప్ ఖాయమేనా..?

గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు మరోసారి జాక్ పాట్ తగనులనుంది. గత ఎన్నికల్లో టీడీపీ గుంటూరులో ఐదు స్థానాల్లో ఓడిపోయింది. ఈ సారి ఆ ఐదింటిలోనూ ఘన విజయం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది సీనియర్‌ నాయకులే. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలపై పట్టుసాధించేం దుకు ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో బలమైన పార్టీ కేడర్‌ ఉండ డంతో వారందరినీ సమన్వయం చేసుకుంటూ, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళితే ఘన విజయం సాధించడం ఖాయమని నేతలు ధీమాగా ఉన్నారు.

విపక్ష వైఎస్సార్‌ కాం గ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లాలో పూర్తిగా కుదలైంది. కీలమైన ఒక్క నేత కూడా గుంటూరు జిల్లాలో వైసీపీకి లేరు. వైసీపీ అంటే.. ప్రజాబలం లేని అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్‌, బాలశౌరి, సుచరిత లాంటి వాళ్లు తప్ప… గట్టిగా వంద మంది అనుచరులు ఉన్న వాళ్లు ఒక్కళ్లు కూడా లేరు. పైగా రాజధానికి వ్యతిరేంగా వైసీపీ వ్యవహరిస్తూండంతో ప్రజలు వారిని ఆదరించేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయం వైఎస్ జగన్ కు కూడా అర్థమయింది. అందుకే.. కులాల కుంపట్ల రగిలిద్దామని చాలా పెద్ద ప్రయత్నాలే చేశారు.కానీ విఫలమయ్యారు. జగన్ కుట్రలు ప్రజలకు తెలిసిపోయాయి. గుంటూరులో కన్నా లక్ష్మినారాయణ వైసీపీ పరోక్ష మద్దతుతో బరిలో నిలబడాలని అనుకుంటున్నారు. ఆయనకు తన సామాజిక వర్గంలో బలం ఉందని.. వైసీపీ సామాజికవర్గ కలసి వస్తే గెలుస్తానని అనుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలో ఉన్న వైసీపీ నేతలంతా నేర చరిత్ర ఉన్న వాళ్లే. వాళ్లకు ఓట్లేసి.. తమ నెత్తిన తెచ్చిపెట్టుకోవడం ఎందుకన్న భావన చాలా మందిలో ఉంది. వారిని కాదనే పరిస్థితి జగన్ కు లేదు. వారు తప్ప అభ్యర్థులు లేరు.ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు లేని పరిస్థితి. అందుకే బాగా డబ్బున్న వ్యక్తులను చూసి.. టిక్కెట్ల ఆఫర్ చూపి పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేసినా.. గుంటూరులో మాత్రం ఈ సారి వైసిపీకి బ్లాంకే..!

Leave a Reply

*