పట్టిస్తే రూ.4కోట్ల కోట్లు ఇస్తారట

జర్మనీ డ్రెస్డెన్ మ్యూజియంలో భారీ దోపిడీకి పాల్పడిన నిందితుల కోసం ఇక్కడి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరు వ్యక్తులు కిటికీ అద్దాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించినట్టు రికార్డయింది. అలా లోపలకు వచ్చిన వారు.. మ్యూజియంలో కరెంట్ కట్ చేసి అక్కడ ఉన్న విలువైన ఆభరణాలను దొంగిలించారు. ఈ దోపిడీలో సుమారు రూ.8వేలకోట్ల విలువ చేసే ఆభరణాలు పోయినట్లు మ్యూజియం అధికారులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ దోపిడీ జర్మనీలో కలకలం రేపింది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే డ్రెస్డెన్ మ్యూజియంలో చోరీ జరగడం పోలీసులకు కొరకరాని కొయ్యలా మారింది. ఇదే సమయంలో చోరీకి గురైన ఆభరణాల గురించి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి విలువ డబ్బుతో కొలవలేనిదని వారు అభిప్రాయపడుతున్నారు. అవి ఇక ఎప్పటికీ కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల గురించి ఎటువంటి సమాచారం అందించినా అర మిలియన్ యూరోల(సుమారు రూ.4కోట్లు) బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. “నిందితుల్ని మేం కచ్చితంగా పట్టుకుని తీరతాం” అని స్పష్టం చేశారు.

Leave a Reply

*