పావలాకి రూపాయి పావలా ఓవరాక్షన్..! జగన్ కోసం ఉండవల్లి తిప్పలు..!!

జగన్ ఎప్పుడు డిఫెన్స్ లో పడిపోతే.. అప్పుడు తెరపైకి వచ్చే ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి బ్యాటింగ్ చేసి డకౌట్ అయ్యారు. కోడి కత్తి డ్రామాలో జగన్ నవ్వుల పాలవడంతో.. దాన్ని కవర్ చేసేందుకు తన లాయర్ తెలివి తేటల్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. జగన్‌కు పొడిపించుకోవాల్సిన అవసరం ఉందా? అని లాయర్ ప్రశ్న వేశారు మరి…వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు.. టీడీపీ నేతలకు కుట్ర చేయాల్సిన అవసరం ఉందా అన్న ప్రశ్నకు మాత్రం.. ఆయన దగ్గర సమాధానం లేదు. దాడి ఘటనపై అనవసర రాద్దాంతం మానుకోవాలని సూచన చేస్తున్నారు. ఓ వైపు వైసీపీ నేతలు తమ డ్రామా ఫెయిలందని ఢిల్లీకి వెళ్లి షో చేస్తూంటే.. మరో వైపు… ఇక్కడ మాత్రం ఉండవల్లి.. జగన్‌పై దాడి ఘటనలో చంద్రబాబు అతిగా స్పందించారని చెప్పుకుంటున్నారు.

జగన్‌పై కత్తిదాడి ఘటనలో పోలీసులే నిజానిజాలు తేలుస్తారని చెప్పుకొచ్చారు.. కానీ జగన్ పోలీసులపై నమ్మకం లేదని చెబుతున్న సంగతిని కూడా మర్చిపోయారు. నిందితుడికి నార్కోఎనాలసిస్‌ టెస్ట్‌ చేయించాలని తీర్పు చెప్పారు. ఈ విషయంలో జగన్ ను సపోర్ట్ చేయడానికి ఎంత లాయర్ తెలిపితేటలు చూపించినా… వర్కవుట్ కావడం లేదు. బియ్యం గింజ అంత గాయానికి.. తొమ్మిది కుట్లేయించుకున్న జగన్ తెలివి తేటల్ని అందరూ .. విస్మయంగా చూస్తున్నారు. ఇప్పుడు… ఆ విస్మయాన్నిఉండవల్లి తనకు అంటించుకున్నారు. ఎంత ఆప్తమిత్రుడి .. రాజకీయ గురువు అయినా.. ఎప్పుడు డిఫెన్స్ లో పడినా.. వచ్చి జగన్ కోసం ఉండవల్లి వాదన వినిపించడం అసహ్యంగా ఉంటోంది.

ఈ విషయంలో ఆయన తనను తాను తటస్థుడిగా చెప్పుకుంటున్నా.. ప్రయోజనం ఉండటం లేదు. ఈ వి,యంలో ఆయన ఆలోచించుకుంటారో.. అలాగే పరువు పోగొట్టుకుంటారో.. రాజకీయవర్గాల్లో ఉన్న విలువ చెడగొట్టుకంటారో చూడాలి మరి..!

Leave a Reply

*