గురజాల గుండెల్లో యరపతినేని..! ఇంచ్‌ కూడా కదల్చలేవు కడప కుట్రలు..!!

గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు… గురజాల ప్రజల గుండెల్లో ఎప్పుడో స్థానం సంపాదించుకున్నారు. ఆయనను ఎవరూ ఎమ్మెల్యేగారూ.. అని సంబోధించరు. అలా సంబోధిస్తే.. ఎవరో దూరపు వ్యక్తి అన్న భావన వస్తుందని.. అందరూ శీనన్నా.. అనే ఆప్యాయంగా పిలుస్తారు. అలా పిలిచేంతటి దగ్గరి వ్యక్తిగా యరపతినేని ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు మరి. శీనన్నా అని గురజాలలో ఏ గ్రామంలో పిలిచినా… ఆపన్న హస్తం అందించేందుకు యరపతినేని అడుగు దూరంలోనే ఉంటారు. అంతగా ప్రజలకు సేవ చేస్తున్న యరపతినేనిపై… వైసీపీ అధినేత జగన్ కన్ను పడింది.

యరపతినేని ఒక్క నియోజకవర్గ ప్రజలకే కాదు.. తెలుగుదేశం పార్టీకి కూడా సెంటిమెంట్. రాష్ట్ర విభజన సమయంలో… ఇతరుల ముసుగులో వైసీపీ చేసిన కుట్రల్ని చేధించడంలో యరపతినేని చూపిన ధైర్యం ఎవరూ మర్చిపోలేరు. ఏపీలో చంద్రబాబు యాత్ర మొదటిసారిగా గురజాల నుంచే ప్రారంభమయింది. అప్పుడు యరపతినేని చూపిన ధైర్యసాహసాలే నేటి టీడీపీకి ఊపిరిగా మారాయి. ఇక వైసీపీ అధినేత జగన్.. భూ దాహాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసేలా.. సరస్వతి భూముల విషయంలో చేసిన పోరాటం అందర్నీ ఆకర్షించింది.. జగన్ దందాలను బయపెట్టింది. ఈ కసి అంతా ఏమో కానీ… అక్రమ మైనింగ్ అంటూ… తనకు మాత్రమే చేతైనైన ఘనకార్యాలను… వైఎస్ జగన్… యరపతినేనిపై రుద్దే ప్రయత్నం చేశారు. కానీ అట్టర్ ఫ్లాపయ్యారు.

యరపతినేనిపై కడప మార్క్ కుట్రలతో ఎంతగా బురద జల్లినా… గురజాల ప్రజల గుండెల్లో ఆయన స్థానం చెరపలేనిది. యరపతినేని అంటే ఏమిటో.. అక్కడి ప్రజలకు తెలుసు. బయట నుంచి వచ్చే వ్యక్తులు .. ఏదో చెప్పి.. ఆయనపై బురద జల్లేస్తే.. నమ్మేయడానికి వారెవరూ సిద్ధంగా లేరు. ఈ విషయం వైసీపీ నేతలకు సులువుగానే అర్థమయినట్లుంది. త్వరగానే తట్టాబుట్టా సర్దుకున్నారు. కానీ ఎన్నికలు వచ్చే కొద్దీ.. శీనన్నపై.. మరింతగా బురద జల్లేందుకు కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుటూనే ఉంటారు. వాటిని ఎదుర్కోవడానికి యరపతినేని కూడా అవసరం లేదు.. తిప్పికొట్టేందుకు ప్రజలే రెడీ ఉన్నారు. శీనన్నా.. తమ మనిషి అని నిరూపించేందుకు మరోసారి రెడీ అయ్యారు.

Leave a Reply

*